Politics

మోదీ మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నా

మోదీ మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నా

ప్రధాని మోదీ ఎప్పుడూ దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు తప్ప.. ఎన్నికల ప్రయోజనాల కోసం కాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భాజపా బీసీ ఆత్మగౌరవ సభలో పవన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి భారతీయుడి గుండెల్లో ప్రధాని మోదీ ధైర్యం నింపారని కొనియాడారు.

‘‘తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందని పరిస్థితి. మోదీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే ఆర్టికల్‌ 370, నోట్ల రద్దు చేసేవారు కాదు. రామమందిరం నిర్మించగలిగేవారు కాదు. మోదీ నాయత్వంలో బీసీల తెలంగాణ రావాలి. నాలాంటి కోట్ల మంది కలలకు ప్రతిరూపమే నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భారతదేశాన్ని ప్రపంచంలోనే నెం.1 దేశంగా తీర్చిదిద్దగలిగే సత్తా ఉన్న నాయకుడు మోదీ’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

భారాస, కాంగ్రెస్‌ డీఎన్‌ఏ ఒక్కటే: కిషన్‌రెడ్డి
భారాస, కాంగ్రెస్‌, మజ్లిస్‌ ఒకే తాను ముక్కలని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు. మన్మోహన్‌ హయాంలో కేసీఆర్‌ మంత్రిగా ఉన్నారని, తెరాస నేతలు మంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అమ్ముడు పోయే పార్టీ అని, భారాస కొనుగోలు చేసే పార్టీ అని విమర్శించారు. ఈ రెండూ అవినీతి పార్టీలేనని ఆరోపించారు. ఈ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కేటనన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z