భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రెండో త్రైమాసిక (Q2 Results) ఫలితాలను మంగళవారం ప్రకటించింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.294.67 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.226.03 కోట్లతో పోలిస్తే 30.36 శాతం వృద్ధి చెందింది.ఐఆర్‌సీటీసీ మొత్తం ఆదాయం రూ.805.80 కోట్ల నుంచి రూ.995.31 కోట్లకు పెరిగింది. దీంతో ఆదాయంలో 23.51 శాతం వృద్ధి నమోదైందని ఐఆర్‌సీటీసీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. వడ్డీ, పన్ను, తరుగుదల కంటే ముందు ఆదాయం (EBITDA) 20.2 శాతం పెరిగి రూ.366.5 కోట్లకు చేరింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.2.50 మధ్యంతర డివిడెండ్ (Interim dividend) చెల్లించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఫలితాల నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ షేరు విలువ 1.68 శాతం పెరిగి రూ.682.75 వద్ద ముగిసింది.
👉 – Please join our whatsapp channel here –