DailyDose

రైల్వే ప్రయాణికులకు కొత్త హెచ్చరిక

రైల్వే ప్రయాణికులకు కొత్త హెచ్చరిక

దీపావళి పండుగ సందర్భంగా రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. దీపావళి పండుగ నేపథ్యంలో ప్రయాణికులు టపాసులు లేదా ఇతర మండే స్వభావం ఉన్న వస్తువులను రైల్లో వెంట తీసుకొని రావొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక నియంత్రణ చర్యలను చేపడుతుంది.

రూ.10 వేలు జరిమానా లేదా 3 ఏళ్ల జైలు శిక్ష…రైల్లో, రైల్వే స్టేషన్ లో టపాసులు తీసుకుని రావడం వల్ల భద్రతకు, ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పునకు దారి తీస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అందుకోసం ప్రయాణికుల భద్రతకు, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే టపాసులు, పేలే పదార్థాలు, మండే స్వభావం ఉన్న వస్తువులను తీసుకుని రావొద్దని స్పష్టం చేసింది. ప్రమాదకరమైన వస్తువులను, నిషేధిత వస్తువులను రైల్లో తీసుకెళ్లడం రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 164, 165 ప్రకారం రూ.1000 జరిమానాతో లేదా 3 సంవత్సరాల జైలు శిక్ష కొన్ని సందర్భాల్లో రెండూ విధిస్తారని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

1939 నంబర్ కు ఫోన్ చేయాలి…….రైలు లేదా రైల్వే స్టేషన్ లలో ఎవరైనా ప్రమాదకరమైన వస్తువులను తీసుకుని వెళ్లినట్టు గమనిస్తే 1939 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించింది. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు అన్నీ ప్రధాన రైల్వే స్టేషన్ లలో ప్రత్యేక భద్రతా బృందాలు, క్విక్ రియాక్టన్ బృందాలను మోహరించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. కాగా ఈ ప్రత్యేక బృందాలు సాధారణ దుస్తులు ధరించి స్నిఫర్ డాగ్స్ సహకారంతో ప్రమాదకరమైన వస్తువులను గుర్తిస్తారని తెలిపింది. ప్రత్యేక నిఘా కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని ప్రకటించింది. రైలు ప్రయాణికులు కూడా రైల్వే సిబ్బంది,ప్రత్యేక బృందాలకు సహకరించాలని కోరింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z