Business

ఉద్యోగులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన విప్రో‌-వాణిజ్య వార్తలు

ఉద్యోగులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన విప్రో‌-వాణిజ్య వార్తలు

* బిగ్​సీలో దీపావళి ఆఫర్లు

ఫోన్లను అమ్మే బిగ్‌‌‌‌ సీ దీపావళి ఆఫర్లను ప్రకటించింది. ప్రతి స్మార్ట్‌‌‌‌ఫోన్ కొనుగోలుపై రూ.10 వేల వరకు ఇన్‌‌‌‌స్టంట్ డిస్కౌంట్‌‌‌‌ ఇస్తోంది. అంతేకాకుండా రూ.4 వేల విలువైన బహుమతిని కచ్చితంగా ఇస్తామని బిగ్‌‌‌‌ సీ ఎండీ యం బాలు చౌదరి పేర్కొన్నారు. వీటితో పాటు స్మార్ట్ వాచ్ ఆఫర్‌‌‌‌‌‌‌‌, లాయల్టీ పాయింట్స్‌‌‌‌ ఆఫర్, స్మార్ట్ టీవీ ఆఫర్‌‌‌‌‌‌‌‌, 1+1 ఎక్స్‌‌‌‌టెండెడ్‌‌‌‌ వారంటీ ఆఫర్‌‌‌‌‌‌‌‌ వంటివి కూడా అందిస్తున్నామని అన్నారు. బజాజ్ ఫైనాన్స్ ద్వారా మొబైల్స్ కొనుగోలు చేస్తే రూ.9 వేల వరకు ఇన్‌‌‌‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నామని బిగ్‌‌‌‌ సీ ప్రకటించింది.ఎస్‌‌‌‌బీఐ ద్వారా ప్రతి మొబైల్‌‌‌‌ లేదా స్మార్ట్ టీవీ, ల్యాప్‌‌‌‌టాప్ కొనుగోలు చేస్తే రూ.3 వేల వరకు ఇన్‌‌‌‌స్టంట్ డిస్కౌంట్‌‌‌‌ను, ఐడీఎఫ్‌‌‌‌సీ ద్వారా కొంటే రూ.7,500 వరకు ఇన్‌‌‌‌స్టంట్ డిస్కౌంట్‌‌‌‌ను ఇస్తున్నామని వెల్లడించింది. కొన్ని మొబైల్స్‌‌‌‌ కొనుగోలుపై రూ.5 వేల విలువైన ఫైర్ బోల్డ్ స్మార్ట్ వాచ్‌‌‌‌ను కేవలం రూ.500 కి అమ్ముతోంది. ప్రతి స్మార్ట్‌‌‌‌ టీవీ కొనుగోలుపై ఒక కచ్చితమైన బహుమతితో పాటు రూ.5,200 విలువైన ఫింగర్స్ బార్ స్పీకర్లను రూ.2,500 కే అమ్ముతోంది. ఐఫోన్ మొబైల్స్ కొనుగోలుపై రూ.7 వేల వరకు బెనిఫిట్స్ పొందొచ్చని బిగ్ సీ వెల్లడించింది. రూ.10‌‌‌‌ వేల విలువైనఫైర్ బోల్ట్‌‌‌‌ స్మార్ట్ వాచ్‌‌‌‌ జోడీ ఆఫర్‌‌‌‌‌‌‌‌ను కేవలం రూ.2 వేలకే అమ్ముతున్నామని తెలిపింది. బ్రాండ్ యాక్సెసరీలపై 51 శాతం వరకు డిస్కౌంట్‌‌‌‌ ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్‌‌, తెలంగాణ రాష్ట్రాల్లో బిగ్‌‌ సీ కి 250 కి పైగా స్టోర్లు ఉన్నాయి.

* ఉద్యోగులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన విప్రో‌

దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ విప్రో తన ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకమీదట ఉద్యోగులంతా వారానికి మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీస్ నుంచి పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇది నవంబర్ 15 నుండి అమల్లోకి వస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే 55 శాతం మంది ఉద్యోగులు వారానికి మూడుసార్లు ఆఫీసులకు వస్తున్నారు. అయితే మిగతా ఉద్యోగులు కూడా వర్క్‌హోమ్‌ను ముగించి హైబ్రిడ్ తరహలో ఆఫీసుల నుంచి పనిచేయాలని, దీని వల్ల వృత్తిపరమైన అభివృద్ధి ఉండటంతో పాటు సహోద్యోగులు, క్లయింట్లతో నేరుగా సంభాషిస్తూ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చని ఐటీ సంస్థ పేర్కొంది. గత రెండేళ్లుగా రిమోట్ వర్కింగ్ లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేసేలా ప్రోత్సహించడానికి ఐటీ సంస్థలు పలు చర్యలు తీసుకుంటున్నాయి.

* 1.7 కోట్లు వదిలేసుకున్న అమెజాన్ ఉద్యోగి

ఆఫీస్‌‌‌‌కు తిరిగిరావాలని అమెజాన్ అడగడంతో పూర్తిగా జాబే మానేశాడు యూఎస్‌‌‌‌కు చెందిన ఓ వ్యక్తి. కేవలం జాబ్ మానేస్తే ఓకే కానీ రూ.1.7 కోట్ల (200,000 డాలర్ల) విలువైన స్టాక్ ఆప్షన్స్‌‌‌‌ను వదులుకున్నాడు కూడా. అయినా తనకు ఎటువంటి బాధ లేదని చెబుతున్నాడు జాన్‌‌‌‌ (పేరు మారింది). ఉద్యోగులు తిరిగి ఆఫీస్‌‌‌‌కు రావడాన్ని అమెజాన్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీంతో న్యూయార్క్ నుంచి సియాటల్‌‌‌‌ వరకు జాన్ ట్రావెల్ చేయాల్సి ఉంటోంది. తన డ్రీమ్‌‌‌‌ లైఫ్‌‌‌‌ను వదులుకోవాల్సి వస్తుందని ఆయన చెప్పారు. ‘అమెజాన్‌‌‌‌లో పనిచేయడాన్ని ఎంజాయ్ చేశా. గత మూడున్నరేళ్లుగా సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్ మేనేజర్‌‌‌‌‌‌‌‌గా పనిచేశా. నా టీమ్‌‌‌‌తో కలిసి పనిచేయడం ఎక్సైటింగ్‌‌‌‌గా ఉండేది. తిరిగి ఆఫీస్‌‌‌‌లకు రావాలని అడగక పోయి ఉంటే జాబ్‌‌‌‌ మానేసేవాడిని కాను’ అని ఆయన వివరించారు.2020 ఏప్రిల్‌‌‌‌లో అమెజాన్‌‌‌‌లో జాయిన్ అయ్యానని, అదే టైమ్‌‌‌‌లో కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్‌‌‌‌ పాలసీ తెచ్చిందని చెప్పారు. ‘నేను న్యూయార్క్‌‌‌‌లో ఉంటున్నాను. నేను, నా భార్య కలిసి తాజాగా డ్రీమ్‌‌‌‌ ప్రాపర్టీ తీసుకున్నాం. సియాటల్‌‌‌‌కు తిరిగి వెళ్లే ఛాన్సే లేదు’ అని జాన్ బిజినెస్‌‌‌‌ ఇన్‌‌‌‌సైడర్‌‌‌‌‌‌‌‌కు వెల్లడించారు. రీలొకేట్ అవ్వాలంటే రూ.1.2 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఇదే విషయాన్ని కంపెనీకి తెలియజేశానని పేర్కొన్నారు. వర్క్ ఫ్రమ్‌‌‌‌ హోమ్‌‌‌‌ మరికొంత కాలం చేసేలా టైమ్ అడిగానని చెప్పారు. కానీ, దీనికి తన బాస్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు.

* ఐటీ రంగంలో తగ్గిన జీతాల పెంపు!

గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఉద్యోగాలు మారే IT ఉద్యోగులకు జీతాల పెంపు సగానికి పైగా తగ్గినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. కరోనా తర్వాత టెక్ సేవలకు డిమాండ్ తగ్గడంతో కంపెనీలు నియామకాలను తగ్గించుకుంటున్నాయి. పలు సంస్థలు ప్రస్తుతం 18-22% హైక్ను అందిస్తున్నాయని, గతంలో కంటే ఇది చాలా తక్కువని స్టాఫింగ్ సంస్థలు చెబుతున్నాయి. AI వంటి వాటిలో స్కిల్స్ ఉన్నవారికి మాత్రం హైడిమాండ్ ఉన్నట్లు పేర్కొన్నాయి.

* నీతా అంబానీ అత్యంత ఖరీదైన కారు

భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగించే సంపన్న కుటుంబాలలో ‘ముఖేష్ అంబానీ’ ఫ్యామిలీ ఒకటి. రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఫెరారీ, బెంట్లీ వంటి ఎక్స్‌పెన్సివ్‌ కార్లను కలిగిన ఉన్న వీరు తాజాగా మరో కాస్ట్లీ కారుని తమ గ్యారేజిలో చేర్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ‘రోల్స్ రాయిస్’ (Rolls Royce) కంపెనీకి చెందిన ‘కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్’ (Cullinan Black Badge) కారు ముంబై రోడ్లపై Z+ సెక్యూరిటీ కాన్వాయ్‌లో వెళ్లడం చూడవచ్చు. ఇది ముకేశ్ అంబానీ భార్య ‘నీతా అంబానీ’కి చెందినట్లు, దీని ధర రూ.10 కోట్లు (ఆన్ రోడ్) వరకు ఉంటుందని సమాచారం.పెట్రా గోల్డ్ షేడ్‌లో కనిపించే ఈ కారు సాధారణ కార్లకంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. 6.75 లీటర్ ట్విన్ టర్బో వి12 పెట్రోల్ ఇంజిన్ కలిగిన కల్లినన్ 5,000 ఆర్‌పీఎమ్ వద్ద 563 బీహెచ్‌పీ పవర్, 1600 ఆర్‌పీఎమ్ 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కిమీ.రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారు లోపల కొన్ని భాగాలు కార్బన్ ఫైబర్‌తో, లెదర్ అపోల్స్ట్రే బ్లాక్ కలర్ స్కీమ్‌ పొందుతుంది. ఇలాంటి కారు ఇప్పటికే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూడా కొనుగోలు చేశారు.

* దివీస్ ​ల్యాబ్స్​ లాభం 348 కోట్లు

హైదరాబాద్​కు చెందిన ఫార్మా కంపెనీ దివీస్ ల్యాబ్స్ సెప్టెంబరు 2023తో ముగిసిన రెండో క్వార్టర్​లో రూ.348 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్​) సంపాదించింది. ఏడాది క్రితం రెండో క్వార్టర్​లో వచ్చిన లాభం రూ. 493 కోట్లతో పోలిస్తే ఇది 29 శాతం తగ్గింది. ఎనలిస్టులు ఈసారి దివీస్​కు రూ.424 కోట్ల లాభం వస్తుందని అంచనా వేశారు. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం వార్షికంగా 3శాతం పెరిగి రూ.1,909 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు సంవత్సరం ఇదే క్వార్టర్​లో ఆదాయం రూ.1,855 కోట్లు ఉంది. ఈ క్వార్టర్​లో కన్సాలిడేటెడ్​ ఇబిటా రూ. 479 కోట్లు కాగా, మార్జిన్లు 25.1శాతం వద్ద ఉన్నాయి.పన్నుకు ముందు లాభం (పీబీటీ) రూ. 469 కోట్లు ఉండగా, గత సంవత్సరం ఇదే క్వార్టర్​లో వచ్చిన రూ. 615 కోట్ల పీబీటీతో పోలిస్తే 24శాతం తగ్గింది. మొత్తం ఆదాయం కూడా 3శాతం పెరిగి రూ. 1,995 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం సెప్టెంబరు -క్వార్టర్​లో రూ. 1,935 కోట్లుగా ఉంది. కంపెనీ గత ఏడాది ఇదే క్వార్టర్​లో రూ. 31 కోట్ల ఫారెక్స్​ లాభం పొందగా, ఈసారి రూ. 11 కోట్ల ఫారెక్స్ లాభాన్ని సాధించింది. సెప్టెంబరు 2023తో ముగిసిన అర్ధ సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం (కన్సాలిడేటెడ్​) రూ. 3,854 కోట్లకు చేరింది. గత అర్ధ సంవత్సరంలో రూ. 4,278 కోట్ల ఆదాయం వచ్చింది.

* తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ ధరలు

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమరు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల ఒకటవ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలను పెంచారు. గృహ వినియోగ గ్యాస్ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్: రూ. 966,వరంగల్: రూ. 974,విశాఖపట్నం:రూ. 912,విజయవాడ: రూ. 927,గుంటూర్: రూ. 944.

* పెట్రోల్ బంకుల్లో బ్యాటరీ మార్పిడి స్టేషన్లు

దేశంలోని తమ పెట్రోల్ బంకుల్లో బ్యాటరీ మార్పిడి స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు HPCL ప్రకటించింది. ఇందుకోసం బ్యాటరీ మార్పిడి సంస్థ గోగారోతో ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా 21 వేల HPCL రిటైల్ అవుట్లెట్లలో బ్యాటరీ మార్పిడి సదుపాయాలు కల్పించనుంది. ఇందులో ద్విచక్రవాహనాల కోసం వెయ్యి బ్యాటరీ మార్పిడి స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.