డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు సినీ ప్రియులు పండగనే చెప్పాలి. క్రిస్మస్ సమయం కావడంతో ఈ సందర్భంగా పలు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా భారీ బడ్జెట్ చిత్రాలను విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో కూడా చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా సలార్. డిసెంబర్ 22 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.అలాగే షారుఖ్ ఖాన్ నటించిన డంకి కూడా ఇదే సమయంలో రిలీజ్ కానుంది. అలాగే డిసెంబర్ లో రిలీజ్ కానున్న సినిమా యానిమల్. ఈ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా మటించారు. ఈ సినిమా పై ఇప్పటికే పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా విడుదలకు ముందే ‘ జవాన్ ’ రికార్డును తిరగరాసింది.
సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ఈ మూవీ ఓ సంచలన విజయం సాధించింది. అలాగే ఇదే సినిమాను హిందీ లో రీమేక్ చేశారు. ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ తో ఈ సినిమాను రీమేక్ చేశారు. ఆ తర్వాత ‘యానిమల్’ సినిమాని టేకప్ చేశాడు సందీప్. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. రణ్‌బీర్ కపూర్‌కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం అమెరికాలో భారీ ఎత్తున విడుదలవుతోంది.
నార్త్ అమెరికాలో 888 స్క్రీన్లలో ‘యానిమల్’ విడుదలవుతోంది. ఇంతకుముందు విడుదలైన ‘జవాన్’ సినిమా నార్త్ అమెరికాలో 850 స్క్రీన్‌లో రిలీజ్ అయ్యింది. ‘బ్రహ్మాస్త్ర’కు 810 స్క్రీన్లలో రిలీజ్ అయ్యింది. ఈ రికార్డును ‘యానిమల్’ బద్దలు కొట్టింది. అమెరికాలో ఇంత భారీ స్థాయిలో విడుదలైన తొలి హిందీ చిత్రంగా యానిమల్ గుర్తింపు తెచ్చుకుంది. ‘జవాన్’, ‘బ్రహ్మాస్త్ర’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. భారతదేశంలోనే కాకుండా విదేశీ మార్కెట్లలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ‘యానిమల్’ చిత్రానికి విదేశాల్లో ఎక్కువ స్క్రీన్లు లభించాయి కాబట్టి కచ్చితంగా వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. దాంతో అభిమానులు ‘యానిమల్’ని చూడాలని ఎదురుచూస్తున్నారు.రణ్‌బీర్, రష్మికతో పాటు బాబీ డియోల్, అనిల్ కపూర్ ఈ చిత్రంలో నటించారు. డిసెంబర్ 1న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –