Movies

బాలకృష్ణ కొత్త మూవీ అప్ డేట్

బాలకృష్ణ కొత్త మూవీ అప్ డేట్

నట సింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో.. వరుస బ్లాక్​బస్టర్లతో దూసుకెళ్తున్నారు. ఒకేసారి రెండు మూడు సినిమాలకు సైన్ చేసేసి.. వరుసగా షూటింగుల్లో పాల్గొంటున్నారు. ఇటీవలే భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య ఇప్పుడు తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టారు. బాలకృష్ణ- డైరెక్టర్ బాబీ కాంబినేషన్​లో ఓ సినిమా తెరకెక్కనుంది. బాలయ్య కెరీర్​లో ఇది 109 వ చిత్రం. NBK109 వర్కింగ్ టైటిల్​తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చింది.ఈ సినిమా షూటింగ్ బుధవారం ప్రారంభమైనట్లు మూవీ టీమ్ ప్రకటించింది. నిర్మాణ సంస్థ సితారా ఎంటర్​టైన్​మెంట్స్.. ‘షూట్ బిగిన్స్​’ అంటూ ఓ పోస్టర్​ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్​లో ఓ పదునైన గొడ్డలికి కళ్లద్దాలు జోడించి ఉండటం.. వీటితోపాటు అమ్మవారి లాకెట్, ఆయుధానికి వేలాడుతూ ఉన్నట్లు కనిపించడంతో ఈ సినిమాలోనూ బాలయ్య వీరమాస్ యాక్షన్ ఉండబోతోందని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ‘లైట్స్ కెమెరా యాక్షన్’, ‘బ్లడ్ బాత్​ కా బ్రాండ్ నేమ్’, ‘వైలెన్స్ కా విజిటింగ్ కార్డ్’ అంటూ క్యాప్షన్స్​ రాసుకురావడంతో బ్లడీ యాక్షన్ ఉండబోతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z