పొట్టలో కొవ్వు (Belly Fat) కరిగించాలనుకునే వారికి వెల్లుల్లి దివ్యౌషధమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన వెల్లుల్లి పొట్టలో కొవ్వును ఇట్టే తగ్గించేస్తుంది. రోజూ మానకుండా ఉదయాన్నే వెల్లుల్లిని తీసుకోవడం ద్వారా పొట్టలో కొవ్వు కరిగించేయవచ్చని న్యూట్రిషనిస్ట్, వెయిట్ లాస్ కన్సల్టెంట్ సిమ్రాన్ సైనీ వివరించారు.
వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ శరీరంలోని మలినాలను తొలగించి జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడంతో బరువు తగ్గడం సులువవుతుందని సిమ్రాన్ సైనీ తెలిపారు. వెల్లుల్లిని నేరుగా తీసుకోవడమే మంచిదని, దీనిలో జీవక్రియల వేగం పెంచే ఔషధాలు ఉండటంతో శరీరం మెరుగ్గా కొవ్వును కరిగించేందుకు సాయపడుతుందని పేర్కొన్నారు. వెల్లుల్లిలో శరీరంలో కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేసే కొన్ని పదార్ధాలున్నాయి. పొట్టలో కొవ్వు కరిగించేందుకు వెల్లుల్లిని మించింది లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుందని జర్నల్ ఆప్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన అధ్యయనం కూడా వెల్లడించింది. రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో వెల్లుల్లిని నానబెట్టి ఆ నీరు తాగడం, వెల్లుల్లి కలిపిన నిమ్మరసం, తేనెలో వెల్లుల్లి రసం, వెల్లుల్లి గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు. అయితే వెల్లుల్లి అందరికీ పడదని, తగిన మోతాదులో దీన్ని తీసుకుని ఆపై తమ శరీరానికి అలవాటు పడిన తర్వాత రెగ్యులర్‌గా తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –