Politics

నేడు అన్నమయ్య కడప జిల్లాల్లో జగన్ పర్యటన

నేడు అన్నమయ్య కడప జిల్లాల్లో జగన్ పర్యటన

ఇవాళ అన్నమయ్య, కడప జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్..ఉదయం 12 గంటలకు రాయచోటి చేరుకోనున్నారు. మండలి డిప్యూటీ ఛైర్మన్ జకియా ఖానమ్ కుమారుడు వివాహ వేడుకకు హాజరుకానున్న జగన్…అనంతరం మాజీ ఎంపీపీ ఇంట్లో వివాహ వేడుకకు హాజరుకానున్నారు.ఇక మధ్యాహ్నం 1.30కి పులివెందుల చేరుకోనున్నారు. పులివెందులలో శ్రీ కృష్ణా టెంపుల్ ను ప్రారంభ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్‌.. అనంతరం స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు శంఖుస్థాపన చేయనున్నారు. పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం జగన్…రాత్రికి ఇడుపులపాయలో నైట్ హాల్ట్ చేస్తారు. ఇక రేపు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆర్కే వ్యాలీ, జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లను ప్రారంభించనున్న సీఎం జగన్…..అనంతరం రెండున్నర గంటల పాటు వేముల మండల స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12.30 కు కడప విమానాశ్రయం నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం జగన్.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Zఅన్నమయ్య, కడప జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన