కొన్ని సందర్భాల్లో ఫోన్‌కాల్స్‌ని లిఫ్ట్ చేసి మాట్లాడడం కుదరదు. అలాంటి సమయాల్లో మెసేజ్ పంపితే అవతలి వ్యక్తి చూసుకుంటారో లేదో తెలీదు. అదే మనం చేసే టెక్ట్స్ మెసేజ్‌ని చదివి వినిపించే ఆప్షన్ ఉంటే ఎంత బాగుంటుంది కదా..? అలాంటి ఫీచర్‌నే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ (Samsung) తీసుకొచ్చింది. భారత్‌లోని తన మొబైల్ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ని పరిచయం చేసింది. ఈ ఫీచర్ సాయంతో ఇన్‌కమింగ్ కాల్స్‌కు శాంసంగ్ వాయిస్ అసిస్టెంట్ అయిన బిక్స్‌బీనే (Bixby) సమాధానం ఇస్తుంది.
సాధారణంగా వచ్చే ఇన్‌కమింగ్ కాల్స్‌కి మనం ఎలా మాట్లాడతామో అలానే మనకు బదులుగా వాయిస్ అసిస్టెంట్ అయిన బిక్స్‌బీ మాట్లాడుతుంది. బిజీగా ఉన్న సమయంలో మనకు కాల్ వస్తే.. బిక్స్‌బీ సాయంతో క్విక్ రెస్పాన్ ఆప్షన్లను ఎంచుకుంటే చాలు.. మనం ఎంచుకొనే ఆప్షన్‌ను బిక్స్‌బీ కాలర్స్‌కు చదివి వినిపిస్తుంది.
ఎలా ఉపయోగపడుతుంది..?
శాంసంగ్ మొబైల్‌లో ఇన్‌కమింగ్ కాల్ వచ్చినప్పుడు బిక్స్‌బీ టెక్ట్స్ ఆప్షన్ (Bixby Text Call) కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోవాలి. ఇలా ఎంచుకున్నప్పుడు అవుతలి వ్యక్తికి మీరు ఆటోమేటెడ్ వాయిస్ రూపంలో (బిక్స్‌బీ) రెస్పాన్స్ ఇస్తున్నారనే సందేశం వెళ్తుంది. అవతలి వ్యక్తి మాట్లాడటం మొదలుపెట్టాక స్క్రీన్ పై రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. క్విక్స్ రెస్పాన్స్ లేదా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో టైప్ చేయొచ్చు. మీరు ఏ ఆప్షన్ ఎంచుకున్నా దాన్ని బిక్స్‌బీ చదివి కాలర్‌కు వినిపిస్తుంది. మధ్యలో వాయిస్ కాల్‌కు మారే ఆప్షన్ కూడా ఉంటుంది. అలాగే ఈ సంభాషణల్ని డిలీట్ చేసే సదుపాయం కూడా ఉంది.
ఇన్‌కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు మాత్రమే బిక్స్‌బీ టెక్ట్స్ కాల్ ఫీచర్‌ని ఉపయోగపడుతుంది. దీని కోసం బిక్స్‌బీ ఫీచర్‌ని ఎనేబల్ చేసుకోవాలి. ‘settings’లోని ‘Bixby text call option’ ఆప్షన్‌ను ఎనేబల్ చేసుకోవాలి. అలాగే బిక్స్‌బీ సాయంతో మనం జరిపే సంభాషణల్ని కూడా మరీ చూడొచ్చు. అనవసరం అనుకుంటే డిలీట్ చేయొచ్చు. శాంసంగ్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ గెలాక్సీ Z ఫోల్డ్, Z ఫ్లిప్, గెలాక్సీ ఎస్ 20 నుంచి 23 సిరీస్ మొబైల్స్‌లో అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు గెలాక్సీ ఏ34, ఏ54, ఏ52ఎస్, ఏ71 5జీ, ఏ51 5జీ, గెలాక్సీ నోట్ 20 ప్లస్ స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు.
👉 – Please join our whatsapp channel here –