పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని నిరూపిస్తే తనతో పాటు రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కస్తూరి నరేందర్ ఈ ఎన్నికల్లో నామినేషన్ వేయబోమని సవాల్ చేశారు. శంషాబాద్ మండలం తొండుపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సృష్టించే సునామీలో భారాస కొట్టుకుపోతుందన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ అభ్యర్థి నరేందర్‌ను లక్ష మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు. శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, ఓఆర్‌ఆర్‌లను నిర్మించింది కాంగ్రెస్ హయాంలోనేనని రేవంత్ గుర్తు చేశారు.
👉 – Please join our whatsapp channel here –