Politics

నామినేషన్ ప్రక్రియకు రేపు చివరి తేదీ

నామినేషన్ ప్రక్రియకు రేపు చివరి తేదీ

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. తుది ఘట్టానికి చేరుకున్న ఈ ప్రక్రియకు రేపటితో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ మంచి ముహూర్తం ఉండటంతో ప్రధాన నేతలంతా ఈరోజే నామపత్రాలు దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మంచి ముహుర్తం ఉండడంతో ఇవాళ భారీ ఎత్తున నామపత్రాలు సమర్పించనున్నారు.సీఎం కేసీఆర్‌ ఇవాళ గజ్వేల్‌, కామారెడ్డిలో నామినేషన్లు వేయనున్నారు. మరోవైపు సిరిసిల్లలో కేటీఆర్.. సిద్దిపేటలో హరీశ్‌రావు.. వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి.. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ నామపత్రాలు దాఖలు చేయనున్నారు. మరోవైపు కాంగ్రెస్ కీలక నేతలు కూడా నామినేషన్ వేయనున్నారు. మధిరలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. హుజూర్‌నగర్‌లో ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మరోవైపు.. బుధవారం ఒక్కరోజే ప్రధాన పార్టీలు సహా స్వతంత్ర అభ్యర్థులు.. 622 మంది నామినేషన్లు వేయగా …. మొత్తం నామపత్రాల సంఖ్య 1314కి చేరినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z