Politics

బీజేపీ నాలుగో జాబితా విడుదల

బీజేపీ నాలుగో జాబితా విడుదల

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అభ్యర్థుల నాలుగో జాబితాను భాజపా గురువారం విడుదల చేసింది. ఇప్పటికే మూడు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ.. నాలుగో జాబితాను గురువారం విడుదల చేసింది. టికెట్‌ ఖరారైన అభ్యర్థులకు భాజపా ముఖ్యనేతలు ఇప్పటికే ఫోన్‌ చేసి సమాచారమందించారు. కంటోన్మెంట్‌-కృష్ణ ప్రసాద్‌, నాంపల్లి-రాహుల్‌ చంద్ర, శేరిలింగంపల్లి-రవికుమార్‌ యాదవ్‌, మేడ్చల్‌ -రామచందర్‌రావు, పెద్దపల్లి-ప్రదీప్ కుమార్, సంగారెడ్డి- పులిమామిడి రాజుకు కేటాయించినట్టు భాజపా ఓ ప్రకటనలో తెలిపింది. మరో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z