జాతీయ స్థాయిలో నదుల అనుసంధానం ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం వేగం పెంచుతోంది. గోదావరికృష్ణా నదుల అనుసంధానంతోపాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో నదుల అనుసంధాన ప్రక్రియకు సబంధించి భాగస్వామ్య రాష్ట్రాలతో చర్చించి ఈ అంశంపై ముందుకు వెళ్లేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీ మరో మారు సమావేశం కానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశం కానున్న ఈ కమిటీ అందుకు జలసౌధను వేదికగా ఎంచుకుంది.
కేంద్ర జలసంఘం చైర్మన్ , ఎన్‌డబ్యుడిఏ డైరెక్టర్ జనరల్ , తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు, కర్ణాటక ,చత్తిస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నీటిపారుదల శాఖల అధికారులు ఈ టాస్క్‌పోర్స్ సమావేశంలో పాల్గొననున్నారు. గోదావరి(ఇచ్చంపల్లి), కావేరి (గ్రాండ్ అనికట్) నదుల అనుసంధాన ప్రక్రియలలో భాగంగా ఈ కీలక సమావేశం జరగనుంది. కెన్, బెత్వా నదుల అనుసంధానం, పర్బగి, కాలిసంద్, చంబల్ ప్రాజెక్టు, కొసి, మేచి లింక్ ప్రాజెక్టు, మహానది, గోదావరి నదుల అనుసంధానం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదుల అనుసంధానం డిపిఆర్ మార్పులపై కూడా చర్చించనున్నారు.
👉 – Please join our whatsapp channel here –