Devotional

అయోధ్యలో అట్టహాసంగా దీపావళి వేడుకలకు ఏర్పాట్లు

అయోధ్యలో అట్టహాసంగా దీపావళి వేడుకలకు ఏర్పాట్లు

దీపావళి (Diwali) వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు సిద్ధం అవుతున్నారు. జాతి, కుల, మత, వర్గ విభేదాలకు అతీతంగా అంత సమైక్యంగా జరుపుకునే పండుగే దీపావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి (Diwali Celebrations) చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు.

అలాంటి ఈ దీపావళి అయోధ్య (Ayodhya )లో అట్టహాసంగా జరగబోతుంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభానికి సిద్ధమవుతున్న ప్రసిద్ధ రామమందిరం అయోధ్యలో దీపావళిని పురస్కరించుకుని ఘనంగా దీపోత్సవాన్ని నిర్వహించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీపావళి రోజున ఆలయ ప్రాంగణంలో ఏకంగా 21 లక్షల దీపాలను వెలిగించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ప్రపంచ రికార్డు కానుందని అంటున్నారు. 2022 దీపావళి సందర్భంగా అయోధ్యలో 15 లక్షల 76 వేల దీపాలు వెలిగించిన విషయం తెలిసిందే. అందుకు గానూ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో చోటు దక్కింది. ఈసారి 21 లక్షల దీపాలను వెలిగించాలని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ సంకల్పించడంతో ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్యలోని 51 ఘాట్లలో 25 వేలమంది వాలంటీర్లు ఈ దీపోత్సవంలో పాల్గొననున్నారు. అలాగే దీపోత్సవం సందర్భంగా సరయూ నీటి ప్రవాహంలో భారీ లేజర్ షో సెంటరాఫ్ అట్రాక్షన్ కానుంది. ఇది మాత్రమే కాదు, దీపోత్సవం తర్వాత, లార్డ్ రామ్ నగరంలో వచ్చే 5 సంవత్సరాల పాటు ప్రతిరోజూ ఇలాంటి వాటర్ షోలు నిర్వహిస్తారు. ఈ సమయంలో, వివిధ రంగులలో వివిధ లైట్లు కనిపించబోతున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z