Movies

సాలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సాలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇండియన్ సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీస్ లలో సలార్(Salaar) ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabahs) హీరోగా వస్తున్న సినిమా కోసం ఫ్యాన్స్ తోపాటు, ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కేజిఎఫ్ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel) నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ నెక్స్ట్ లెవల్లో ఉండటంతో ఆ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఇక డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఇందులో భాగంగా సలార్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారట మేకర్స్. నిజానికి చాలా కాలంగా సలార్ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. తాజా సమాచారం ప్రకారం సలార్ ట్రైలర్ ను డిసెంబర్ 1న చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z