Politics

నేడు కామారెడ్డికి సిద్ధరామయ్య

నేడు కామారెడ్డికి  సిద్ధరామయ్య

కామారెడ్డిలో నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. రేవంత్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొనున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలో నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామని హామీలతో బీసీ డిక్లరేషన్ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఈ సభకు కాంగ్రెస్ ముఖ్యనేతలు హాజరు కానున్నట్లు సమాచారం. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ బహిరంగ సభలో పాల్గొని బీసీ డిక్లరేషన్ విడుదల చేయనున్నట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ వెల్లడించారు.ఇక, కామారెడ్డిలో బీఆర్ఎస్ తరపున కేసీఆర్ నిన్న నామినేషన్ వేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడుతూ.. తాను గెలిస్తే కామారెడ్డి రూపురేఖలు మార్చేస్తానని వెల్లడించారు. తనపై ఓ దొంగ పోటీ చేసేందుకు వస్తున్నాడు.. అతని పట్ల మీరందరు జాగ్రత్తగా ఉండాలని రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీల ప్రధాన నేతలు ఇక్కడ పోటీలో ఉండటంతో కామారెడ్డి రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క సారిగా హీట్ పెంచేస్తున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z