Devotional

పెళ్లి చేసుకునే వారికి టీటీడీ శుభవార్త

పెళ్లి చేసుకునే వారికి టీటీడీ శుభవార్త

తిరుమల శ్రీవారిని నిత్యం జనాలు ఎక్కడినుంచో వచ్చి దర్శించుకుంటారు. స్వామి వారి ఆశీస్సుల కోసం గంటల తరబడి వెయిట్ చేసి మరీ ఆయన ఆశీర్వాదాలు పొందుతారు. ముఖ్యంగా కొంత మంది జంటలు పెళ్లి కాగానే తిరుమలకు వెళ్లి వస్తుంటారు. తాజాగా, కొత్తగా పెళ్లి చేసుకునే వధూవరులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలో పెళ్లీల సీజన్ వస్తుండటంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. నూతన వధూవరులకు శ్రీవారి కళ్యాణ తలంబ్రాలు, పసుపు, కుంకుమ, ప్రసాదాలు, కల్యాణ సంస్కృతి పుస్తకాన్ని అందించే కార్యక్రమాన్ని టీటీడీ పునఃప్రారంభించింది. ఇవన్నీ పొందాలంటే పెళ్లి ముహూర్తానికి నెల ముందు శుభలేక పంపితే వాటిని పోస్టులో పంపుతామని అధికారులు వెల్లడించారు. మీ పూర్తి అడ్రస్‌తో ఈవో ఆఫీస్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కేటీ రోడ్, తిరుపతి-517501 అనే చిరునామాకు కార్డ్ పంపాలని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z