Business

15 నుంచి విశాఖ విమానాశ్రయం రాత్రిపూట మూసివేత

15 నుంచి విశాఖ విమానాశ్రయం రాత్రిపూట మూసివేత

ఈ నెల 15 నుంచి రాత్రిపూట విశాఖ విమానాశ్రయం మూసివేస్తున్నట్టు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. రన్‌వే పునరుద్ధరణ పనుల కోసం రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకు విమానాశ్రయం మూసివేయనున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పగటిపూట విమాన సర్వీసులు పెంచాలని అధికారుల నిర్ణయించారు. రాత్రిపూట విమానాశ్రయం మూసివేతపై నౌకాదళ అధికారులతో ఎంపీ జీవీఎల్‌ చర్చించారు. రన్‌వే పనుల కోసం రాత్రిపూట మూసివేత తప్పదని ఈఎన్సీ చీఫ్‌ పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పగటిపూట సర్వీసులు పెంచుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రన్‌వే పునరుద్ధరణ పనులు పూర్తి చేసేందుకు 4 నుంచి 6 నెలల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z