కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు దేనికి సంకేతమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకుముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. భాజపా, భారాస నేతల ఇళ్లపై ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు రేవంత్ ట్వీట్ చేశారు.‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోదీ – కేడీ బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇది. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయం’’ అని రేవంత్ పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –