గ్యాస్ సిలిండర్ రూ.500కే ఇస్తామంటూ కాంగ్రెస్, రూ.400లకే ఇస్తామంటూ భారాస ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించాయి. అంతేనా నేనైతే ఏడాదికి రూపాయికే నాలుగు సిలిండర్లు ఇస్తానంటున్నారు సనత్‌నగర్ నుంచి పోటీ చేస్తున్న ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి కుమ్మరి వెంకటేష్ యాదవ్. ఇదొక్కటే కాదు.. రూపాయికే ఉచిత విద్య, రూపాయికే వైద్యం, రూపాయికే న్యాయ సలహాలిస్తానని చెబుతున్నారు. ప్రతి వంద కుటుంబాలకు ఒక వాలంటీరును నియమిస్తామని, 70 ఏళ్లు దాటిన వారు ఎమర్జెన్సీ పానిక్ బటన్ నొక్కగానే వచ్చి సాయం అందిస్తానంటూ ప్రచారం చేస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –