చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో కృష్ణపట్నం వద్ద అభివృద్ధి చేయనున్న పారిశ్రామిక నగరం ‘క్రిస్’సిటీ నిర్మాణానికి దిగ్గజ సంస్థలు పోటీపడుతున్నాయి. తొలిదశలో రూ.1,503.16 కోట్లతో 2,500 ఎకరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులివ్వడంతో ఈపీసీ విధానంలో రూ.1,021.41 కోట్ల విలువైన పనులకు టెండర్లు ఆహ్వానించింది. తుది బిడ్డింగ్‌లో మూడు కీలక సంస్థలు అర్హత సాధించినట్లు ఏపీఐఐసీ వీసీఎండీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
ప్రస్తుతం ఈ టెండర్ల మదింపు జరుగుతోందని, అర్హత సాధించిన తర్వాత వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధంచేసినట్లు ఆయన తెలిపారు. చెన్నై–బెంగళూరు కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం వద్ద 10,834.5 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.
ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్‌డిక్ట్)తో కలిసి ఏపీఐఐసీ నిక్‌డిక్ట్–కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్‌మెంట్ లిమిటెడ్ (క్రిస్‌సిటీ) పేరుతో ప్రత్యేక కంపెనీని ఏర్పాటుచేసింది. పూర్తిస్థాయిలో తొలిదశ అందుబాటులోకొస్తే 78,900 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.
👉 – Please join our whatsapp channel here –