ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి కన్ను మార్పిడి శస్త్రచికిత్సను అమెరికా సర్జన్లు పూర్తి చేశారు. ఈ చికిత్స జరిగిన వ్యక్తికి తిరిగి చూపు వస్తుందని కచ్చితంగా చెప్పలేకపోయినా..ఈ చికిత్సను వైద్య రంగ చరిత్రలో కీలక మైలురాయిగా పేర్కొంటున్నారు. ఈ శస్త్రచికిత్సలో దాత నుంచి సేకరించిన ఎడమ కన్నును అరాన్ జేమ్స్ అనే లైన్ వర్కర్‌కు అమర్చారు.
గతంలో ఇలా పూర్తి కంటి మార్పిడి చికిత్స జంతువుల్లో కొంతవరకు విజయవంతమై పాక్షికంగా చూపు వచ్చింది. జేమ్స్‌కు అమర్చిన కన్ను ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. ‘చూపును తిరిగి తెప్పించగలమని మేము చెప్పడం లేదు. కానీ దాన్ని సాధ్యం చేయడానికి మరో ముందడుగు వేశామనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని జేమ్స్‌కు సర్జరీ చేసిన బృందంలోని సభ్యుడైన డాక్టర్ రోడ్రిగెజ్ అన్నారు.
👉 – Please join our whatsapp channel here –