కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలోని నిఘా విభాగం ఇంటెలిజెన్స్ బ్యూరో( Intelligence Bureau)లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులకు గడువు ఇంకా ఒక్కరోజే మిగిలి ఉంది. మొత్తం 677 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల కాగా.. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. వీటిలో 362 సెక్యూరిటీ అసిస్టెంట్- మోటార్ ట్రాన్స్‌పోర్టు (డ్రైవర్) పోస్టులు ఉండగా.. 315 మల్టీ టాస్కింగ్ సిబ్బంది (Multi-Tasking Staff) పోస్టులు ఉన్నాయి. పదో తరగతి లేదా తత్సమాన కోర్సులు చేసినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తికలిగిన అభ్యర్థులు నవంబర్ 13న రాత్రి 11.59గంటల వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
*** ఉద్యోగ ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలివే..
* అభ్యర్థుల వయో పరిమితి: సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు 27 ఏళ్లు మించరాదు. ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.
* వేతనం: సెక్యూరిటీ అసిస్టెంట్- మోటార్ ట్రాన్స్‌పోర్టు పోస్టులకు రూ.21,700- రూ.69,100; మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రూ.18వేలు నుంచి రూ.56,900
* అక్టోబర్ 14 నుంచి మొదలైన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 13తో ముగుస్తుంది.
* దరఖాస్తు రుసుం: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500 (పరీక్ష ఫీజు ₹50, రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఛార్జి రూ.450). ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు రూ.450 (పరీక్ష ఫీజు మినహాయింపు)
* ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్), (డిస్క్రిప్టివ్ విధానం), డ్రైవింగ్ నైపుణ్యాలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
* తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఏపీలో అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం; తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్, వరంగల్ అర్బన్.
Apply Online Here – https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/85755/Index.html
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z