నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బజార్‌ఘాట్‌లోని ఓ రసాయన గోదాంలో నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకుని ఏడుగురు కార్మికులు మృతిచెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్ ఉండటంతో కారు రిపేర్ చేస్తుండగా మంటలు వచ్చాయి. అదే సమయంలో అక్కడ డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండటంతో వాటికి అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. మంటలను చూసి పక్కనే అపార్ట్‌మెంట్లలో ఉంటున్నవారు భయాందోళనకు గురవుతున్నారు.
👉 – Please join our whatsapp channel here –