కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో తెలుగు యువత అధికార ప్రతినిధి మంద విజయ్‌గోపాల్‌పై దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.‘‘విజయ్ గోపాల్‌ను చెప్పులతో కొట్టిన వైకాపా సైకోలను అవే చెప్పులతో ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. పాలక పార్టీ నేతలు ఫ్యాక్షనిస్టుల కంటే ఘోరంగా దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?’’ అని లోకేశ్ నిలదీశారు. బాధితులపైనే రివర్స్ కేసులు బనాయించడం సిగ్గుచేటని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
👉 – Please join our whatsapp channel here –