తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రచారంలో అన్ని పార్టీలు మునిగిపోయాయి. ఇక ఇటు కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చాలా కష్టపడుతున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అయితే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇవాళ తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.పలు గ్రామాలలో కార్నర్ మీటింగ్స్ లో పాల్గొంటారు. ఇక రేపు వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్ మరియు కామారెడ్డి నియోజకవర్గాలలో ప్రచారం చేస్తారు రేవంత్ రెడ్డి. ఈనెల 15వ తేదీన బోథ్, నిర్మల్ మరియు జనగామ బహిరంగ సభలో కూడా రేవంత్ రెడ్డి ప్రచారం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
కాగా, బీఆర్ఎస్ నేతలు డ్రామాలు బాగా చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ పై దాడి జరిగినప్పుడు హరీశ్ రావు బాగా నటించారు. ప్రభాకర్ రెడ్డి పై దాడి వెనుక కాంగ్రెస్ కుట్ర లేదని పోలీసులు తేల్చారు. మరోవైపు అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజుపై దాడి జరగ్గా.. కేటీఆర్ ఇంకా బాగా నటించారు. బీఆర్ఎస్ కుట్రలపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు.
👉 – Please join our whatsapp channel here –