తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం ఉదయం ముత్యపు పందిరి వాహనంపై శ్రీ మహా విష్ణువు అలంకారంలో గజేంద్ర మోక్షం ఘట్టంతో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. వాహనసేవలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.మధ్యాహ్నం శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లుతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సింహ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులను కటాక్షించనున్నారు. వాహన సేవల్లో పెదజీయర్ స్వామి, చినజీయర్ స్వామి, తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, బోర్డు సభ్యులు, తితిదే అధికారులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –