Politics

ఈ విషయంపై రేపు కోర్టుకు వెళుతున్న

ఈ విషయంపై రేపు కోర్టు వెళుతున్న

బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలకు ఓట్లు వేయకండని, 30వ తేదీన ఓట్లు వేయకుండా ఇంట్లోనే కూర్చోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ పిలుపునిచ్చారు. ఇవాళ హైదరాబాద్‌లో పార్టీ సింబల్ విషయమైన ఎన్నికల సంఘాన్ని ఆయన కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, కుటుంబ పాలనను అంతం చేయాలని అన్నారు. తమ పార్టీ ఆక్టీవ్‌లో ఉన్న ఇనాక్టీవ్ చేశారని, ఈ విషయంపై రేపు కోర్టు వెళుతున్నట్లు తెలిపారు. పరేడ్ గ్రౌండ్‌లో సభ పెట్టడానికి మందకృష్ణ మాదిగకు రూ. 72 కోట్లు ముట్టాయని, మందకృష్ణను తన పార్టీలో చేరమంటే రూ. 25 కోట్లు అడిగారని ఆరోపించారు. మోడీని ఘోరమైన తిట్లు తిట్టిన మందకృష్ణ మాదిగ.. ఇప్పుడు మోడీ దేవుడు అని అంటున్నారని, ఒక ఎంపీ సీటు ఇస్తారని మందకృష్ణ మాదిగ అమ్ముడు పోయారని ఆరోపించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z