5జీ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలు ‘జియో ఎయిర్‌ఫైబర్ (Jio AirFiber)’ను రిలయన్స్ జియో మరికొన్ని నగరాలు, పట్టణాలకు విస్తరించింది. తొలుత ఈ సర్వీసులను హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, ముంబయి, పుణె.. మొత్తం 8 మెట్రో నగరాల్లో మాత్రమే ప్రారంభించారు. దీపావళి సందర్భంగా తాజాగా మరో 115 నగరాలకు విస్తరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. వెబ్‌సైట్‌లో జియో ఎయిర్‌ఫైబర్ (Jio AirFiber) కోసం ప్రత్యేకంగా ఓ పేజీని ప్రారంభించిన కంపెనీ.. నగరాలు/పట్టణాల జాబితాను అందులో అందుబాటులో ఉంచింది.
తెలుగు రాష్ట్రాల్లో..
ఆంధ్రప్రదేశ్: అనంతపురం, కడప, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం
తెలంగాణ: హైదరాబాద్, ఆర్మూరు, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మిర్యాలగూడ, నిర్మల్, నిజామాబాద్, పాల్వంచ, పెద్దపల్లి, రామగుండం, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, తాండూరు, వరంగల్
వీటతో పాటు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీ, పశ్చిమబెంగాల్‌లో పలు నగరాలకు జియో ఎయిర్‌ఫైబర్ సేవలను విస్తరించారు. ఈ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌లో 550కు పైగా డిజిటల్ టీవీ ఛానెళ్లు, 16కు పైగా ఓటీటీ యాప్‌లు, స్మార్ట్‌హోమ్ సేవలు పొందొచ్చన్న విషయం తెలిసిందే.
జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్లు ఇవే..
రూ.599 (30 ఎంబీపీఎస్): 550+ డిజిటల్ ఛానెళ్లు, 14 ఓటీటీ యాప్‌లు
రూ.899 (100 ఎంబీపీఎస్): 550+ డిజిటల్ ఛానెళ్లు, 14 ఓటీటీ యాప్‌లు
రూ.1199 (100 ఎంబీపీఎస్): 550+ డిజిటల్ ఛానెళ్లు, 14 ఓటీటీ యాప్‌లు, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియం
జియో ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ ప్లాన్లు..
రూ.1,499 (300 ఎంబీపీఎస్): 550+ డిజిటల్ ఛానెళ్లు, 14 ఓటీటీ యాప్‌లు, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియం
రూ.2,499 (500 ఎంబీపీఎస్): 550+ డిజిటల్ ఛానెళ్లు, 14 ఓటీటీ యాప్‌లు, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియం
రూ.3,999 (1 జీబీపీఎస్): 550+ డిజిటల్ ఛానెళ్లు, 14 ఓటీటీ యాప్‌లు, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోసినిమా ప్రీమియం
14 ఓటీటీ ఛానెళ్లలో జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీలివ్, జీ5, యూనివర్సల్+, లయన్స్ గేట్, సన్‌నెక్ట్స్, హోయ్‌చాయ్, డిస్కవరీ+, షెమారూమీ, ఆల్ట్ బాలాజీ, ఇరోస్ నౌ, ఎపిక్ ఆన్, డాక్యుబె వంటివి లభిస్తాయి.
👉 – Please join our whatsapp channel here –