Politics

టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్

టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్

వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు తెదేపా ఇన్‌ఛార్జ్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇటీవల వైకాపా కార్యకర్త బెనర్జీపై దాడి జరిగింది. ఈ ఘటనలో ప్రవీణ్‌ ప్రమేయం ఉందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం స్థానిక వైఎంఆర్‌ కాలనీలోని ఆయన ఇంటికి పోలీసులు వెళ్లారు. అక్కడ ప్రవీణ్‌ మీడియాతో మాట్లాడుతుండగా అరెస్ట్‌ చేసేందుకు వచ్చారు. దీంతో ఆయన పోలీసు వాహనం ఎక్కకుండా పీఎస్‌ వరకు నడుచుకుంటూ ర్యాలీగా వెళ్లారు.మరోవైపు తెదేపా జిల్లా ముఖ్యనేతలు శ్రీనివాసులురెడ్డి, పుత్తా నరసింహారెడ్డి, వీరశివారెడ్డి, నారాయణరెడ్డితో పాటు కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. బెనర్జీపై దాడి ఘటనలో ప్రవీణ్‌కు సంబంధం లేకపోయినా అక్రమంగా కేసు నమోదు చేశారంటూ తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z