Kids

నేడు బాలల దినోత్సవం

నేడు బాలల దినోత్సవం

మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటాము. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. నెహ్రూకు పిల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు. అందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో బాలల దినోత్సవంలు జరుపుకుంటారు. అలాగే మనదేశంలోనూ బాలల దినోత్సవం జరుపుకుంటారు. మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటాము.

భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. నెహ్రూకు పిల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు. భారత తపాళా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు తపాలా బిళ్ళను విడుదల చేస్తుంది. 1925లో, బాలల సంక్షేమం పై ప్రపంచ సదస్సు సందర్భంగా జెనీవాలో అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని తొలిసారిగా ప్రకటించారు. 1950 నుండి, అనేక దేశాలలో జూన్ 1 న జరుపుకుంటారు. నవంబర్ 20 , 1959 న UN జనరల్ అసెంబ్లీ ద్వారా బాలల హక్కుల ప్రకటన జ్ఞాపకార్థం నవంబర్ 20న ప్రపంచ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు . కొన్ని దేశాల్లో ఇది బాలల వారోత్సవం మరియు బాలల దినోత్సవం కాదు. సిక్కులు డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 27 వరకు బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. USలో, బాలల దినోత్సవాన్ని జూన్ రెండో ఆదివారం జరుపుకుంటారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z