నచ్చిన పాటను యూట్యూబ్ (YouTube)లో చూడాలంటే టెక్ట్స్‌తో సులువుగా వెతకొచ్చు. వాయిస్ సెర్చ్ ఫీచర్ ద్వారా సాంగ్ సెర్చ్ చేయొచ్చు. లిరిక్స్ గుర్తున్నప్పుడు ఇలా పాటను వెతకడం సులువే. అయితే కొన్నిసార్లు మనకు నచ్చిన పాట ట్యూన్ మాత్రమే మెదడులో కదులుతూ ఉంటుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా లిరిక్స్ మాత్రం గుర్తుకు రావు. ఇలాంటి సందర్భాల్లో పాటను వెతకడం కాస్త కష్టమే. అలాంటి వారి కోసమే ఈ ఫీచర్. కేవలం హమ్ చేస్తే పాటను గుర్తించేలా యూట్యూబ్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. మ్యూజిక్‌కి హమ్ చేసినా.. ట్యూన్‌ని విజిల్ ద్వారా వేసినా.. టీవీలో ప్లే అవుతున్నపాటను యూట్యూబ్‌లో ప్లే చేయాలన్నా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
ఎలా వాడాలంటే..?
యూట్యూబ్ యాప్‌లోకి వెళ్లి సెర్చ్ బార్ పక్కనున్న మైక్రోఫోన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మైక్రోఫోన్ యాక్సెస్ కోసం పర్మిషన్ ఇవ్వండి.
మైక్ సింబల్‌పై లాంగ్ ప్రెస్ చేస్తే రెండు ఆప్షన్లు ఓపెన్ అవుతాయి. అందులో సాంగ్ అనే ఆప్షన్ ఎంచుకోండి.
తర్వాత మీకు నచ్చిన పాటను మూడు సెకన్లపాటు హమ్ చేస్తే సెర్చ్ రిజల్ట్‌లో మీకు కావాల్సిన కంటెంట్ కనిపిస్తుంది.
ఒరిజనల్ పాటతో పాటు, యూజర్లు క్రియేట్ చేసిన కంటెంట్, సదరు పాటతో ఉన్న షార్ట్స్ కూడా దర్శనమిస్తాయి.
కేవలం యూట్యూబ్ మొబైల్ యాప్‌లో మాత్రమే ఈ ఫీచర్‌ని యాక్సెస్ చేయవచ్చు. కొందరు యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
👉 – Please join our whatsapp channel here –