తెదేపాకు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. పార్టీకి సంబంధించిన ఖాతాల వివరాలను ఈనెల 18లోపు ఇవ్వాలని అందులో పేర్కొంది. తెదేపా కేంద్ర కార్యాలయానికి సీఐడీ కానిస్టేబుల్ వెళ్లి కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబుకు ఈ నోటీసులు అందజేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నేపథ్యంలో పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాల వివరాలు కావాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది. సీఐడీ అధికారులు వేధిస్తున్నారంటూ ఇప్పటికే తెదేపా హైకోర్టును ఆశ్రయించింది.
👉 – Please join our whatsapp channel here –