Editorials

విజయవాడలో పుస్తక ప్రదర్శన

విజయవాడలో పుస్తక ప్రదర్శన

ఏటా జనవరి ఒకటో తేదీ నుంచి మొదలయ్యే విజయవాడ పుస్తక మహోత్సవం కొంచెం ముందుగానే ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన ఈ పుస్తక మహోత్సవాన్ని డిసెంబరు 28వ తేదీ నుంచి నిర్వహించాలని విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను సెర్ప్‌ సీఈవో ఎండీ ఇంతియాజ్‌ విజయవాడలోని బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఏటా జనవరి ఒకటి నుంచి 11వ తేదీ వరకు ఈ మహోత్సవాన్ని నిర్వహించేవారు. డిసెంబరు 28 నుంచి జనవరి ఏడో తేదీ వరకు ఈ పుస్తక మహోత్సవాన్ని విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్టు బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ ప్రతినిధులు టి.మనోహరనాయుడు, బి.బాబ్జి తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z