Politics

నేటి నుంచి కుల గణన ప్రక్రియ ప్రారంభం

నేటి నుంచి కుల గణన ప్రక్రియ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.. రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కులగణన ప్రారంభించనున్నారు.. మొదట 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో కులగణన ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు.. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో కుల గణన జరగనుంది.. రెండు రోజుల పాటు ప్రయోగాత్మకంగా కులగణన చేపట్టనున్నారు.. ఇక, కుల గణనపై ఈ నెల 22 తేదీ వరకు శిక్షణ నిర్వహించనున్నారు.. ఇవాళ్టి నుంచి జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబోతున్నారు.. ఐదు పట్టణాల్లో ప్రాంతీయ సదస్సులు జరగనున్నాయి.. ఈ నెల 17న రాజమండ్రి, కర్నూలులో ప్రాంతీయ సభలు నిర్వహించనుండగా.. ఈ నెల 20న విజయవాడ, విశాఖపట్నంలో, 24న తిరుపతిలో ప్రాంతీయ సదస్సులు జరగనున్నాయి.. కాగా, కుల గణన జరగాలంటూ పలు రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.. ముఖ్యంగా బీసీ కుల గణన జరగాలంటున్నారు.. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి.. ఇదే సమయం కొన్ని రాష్ట్రాలు కుల గణనకు పూనుకోగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z