Politics

నేటి నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ

నేటి నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ

శాసనసభ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా వారి పోలింగ్‌ కేంద్రం, బూత్‌ల వివరాలతో కూడిన చీటీలను ఎన్నికల అధికారులు బుధవారం నుంచి వారం పాటు పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఏకకాలంలో ఓటరు చీటీల పంపిణీ కొనసాగనుంది. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో మాత్రం ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకే పంపిణీ చేయనున్నామని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. బూత్‌స్థాయి అధికారులు వీటిని పంపిణీ చేస్తారని, ఈ కార్యక్రమాన్ని నోడల్‌ అధికారులు సమీక్షించనున్నారని వివరించారు. చీటీలు అందనివారు బీఎల్‌వోను సంప్రదించాలని సూచించారు. జిల్లా నోడల్‌ అధికారిగా కేఎస్‌బీ కుమారి(ఫోన్‌ నంబరు 79950 86357) నియమించామని తెలిపారు. శేరిలింగంపల్లి పరిధిలో ఎక్కువమంది ఓటర్లున్న దృష్ట్యా మంగళవారం నుంచే ఓటరు పంపిణీ చేస్తున్నామని, అక్కడ ఈనెల 23 వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z