ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. లంక భూముల రైతులకు ఈనెల 17న సీఎం జగన్ పట్టాలు ఇవ్వనున్నారు. కృష్ణ, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 9062 ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో 17,768 మంది కుటుంబాలు లబ్ధి పొందనున్నారు. అత్యధికంగా బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో 710 మంది రైతులకు 295 ఎకరాలకు సంబంధించి పట్టాలు అందనున్నాయి. ఇక అటు సామాజిక పెన్షన్లపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే ఇంట్లో ఇద్దరు అర్హులు ఉంటే అందులో ఒక్కరికే పెన్షన్ ఇస్తామంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2019 డిసెంబర్ లో తెచ్చిన జీవోలో జోక్యం చేసుకోలేని స్పష్టంచేసింది. ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అంటూ పిల్ ను వేసింది. అయితే కుటుంబంలో వితంతు, వృద్ధాప్య పెన్షన్ తో పాటు 80%కి పైగా అంగవైకల్యం, డయాలసిస్ బాధితులకు పెన్షన్ ఇస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
👉 – Please join our whatsapp channel here –