DailyDose

తెలంగాణలో మద్యం రవాణా పై నిఘా

తెలంగాణలో మద్యం రవాణా పై నిఘా

ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాల మేరకు తెలంగాణలోని 18 మద్యం డిస్టిలరీలపై నిఘా పెట్టినట్లు ఎక్సైజ్‌ శాఖ సంయుక్త కమిషనర్ సురేష్ తెలిపారు. 10 బృందాలను ఏర్పాటు చేసి.. ఒక్కో బృందానికి ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ను బాధ్యులుగా నియమించినట్లు ఆయన తెలిపారు. 18 డిస్టిలరీలను అధికారుల బృందం ఆకస్మికంగా పరిశీలించిందని.. ఉత్పత్తి, సరఫరా, సంబంధింత రిజిస్టర్లను పరిశీలించినట్లు చెప్పారు. రికార్డులన్నీ సక్రమంగా ఉన్నట్లు అధికారుల పరిశీలనలో తేలిందని సురేష్ పేర్కొన్నారు. మద్యం డిస్టిలరీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని ఎక్సైజ్‌ శాఖ ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేసినట్లు ఆయన తెలిపారు. 24 గంటల పాటు సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు.. మద్యం అక్రమ రవాణా జరగకుండా నిఘా పెట్టినట్లు సంయుక్త కమిషనర్ సురేష్ తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z