దేవుడి ప్రసాదం లూటీ చేస్తే రోగాలు మాయం
దేవుని దగ్గర ప్రసాదాలు పెట్టడం.. అక్కడ గిరిజనులు వచ్చి లూటీ చేయటం.. రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌లో ఉన్న శ్రీనాథ్‌జీ ఆలయంలో జరిగే అన్నకూట్ పండుగలో గత 350 ఏళ్లుగా ఈ తంతు జరుగుతూనే ఉంది. ఈ పండుగను రాజ్‌సమంద్ ప్రజలు దీపావళి తరవాత రోజున ఘనంగా నిర్వహించుకుంటారు. శ్రీనాథ్‌జీ, విఠల్‌నాథ్‌జీ, లాలన్‌కు భక్తులు వివిధ రకాల నైవేద్యాలను పెడతారు. వాటిని రాత్రి 11 గంటల సమయంలో గిరిజనులు వచ్చి దోచుకుంటారు. ‘‘ఈ నైవేద్యాలను తీసుకుంటే సమస్త రోగాలు నయమవుతాయని గిరిజనులు నమ్ముతారు’’ అని ఆలయ ప్రతినిధులు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –