Devotional

ఈ రాశికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం-రాశిఫలాలు

ఈ రాశికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం-రాశిఫలాలు

మేషం

అనుకున్న వ్యవహారాలు చురుకుగా ముందుకు సాగుతాయి. ముఖ్యంగా ఆదాయ సంబంధమైన ప్రయత్నాలు, వ్యవహారాలకు ఎదురుండదు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొన్ని విషయాలలో బంధువులు, మిత్రులతో మాట పట్టింపులు ఏర్పడ తాయి. వృత్తి, వ్యాపారాల్లో వేగం పెరుగుతుంది. కార్యకలాపాలు పెరిగి ఒత్తిడికి గురవుతారు. ఉద్యో గాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

వృషభం

ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సోదరు లతో దీర్ఘకాలంగా ఉన్న ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మార్పు లుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం

ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందివస్తాయి. ప్రయాణాలలో మంచి పరిచయాలు కలుగుతాయి. వాహన యోగం ఉంది. ముఖ్యమైన పనుల్లో ఇబ్బందులు, అవాంతరాలున్నప్ప టికీ వాటిని అధిగమిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. బంధు మిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

కర్కాటకం

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి సమయం అను కూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి అవకా శాలు అందివస్తాయి. వివాహ ప్రయత్నాలు చాలావరకు అనుకూలిస్తాయి. వృత్తి జీవితం ఆశాజ నకంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో పోటీని తట్టుకోగల స్థితిలో ఉంటారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.

సింహం

ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. ఉద్యోగంలో జీతభత్యాలు ఆశించినంతగా పెరుగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవు తాయి. ఆదాయ పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి.. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. ఇతరుల విష యాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవు తుంది.

కన్య

ముఖ్యమైన అవసరాలకు చేతికి డబ్బు అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధి స్తారు. మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. వ్యాపారా లలో నష్టాలు ఉండకపోవచ్చు. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో ఒకటి రెండు సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.

తుల

చక్కని ధన యోగానికి అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అంది, అవసరాలు తీరుతాయి. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలతో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు లభి స్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. గృహ, వాహనాల కొనుగోలు మీద దృష్టి పెడతారు. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది.

వృశ్చికం

ముఖ్యమైన పనుల్నిసకాలంలో పూర్తి చేస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధుమిత్రుల నుంచి అవసరానికి సహాయం అందుతుంది. స్థిరాస్తి అమ్మకాలు, కొనుగోళ్లు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

ధనుస్సు

ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు విజయ వంతం అవుతాయి. ఇతరులకు సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. సామాజి కంగా గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పిల్లల నుంచి శుభ వార్తలు అందుతాయి.

మకరం

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆస్తి వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొందరు దూరపు బంధువులు, పరిచయస్థులు బాగా సన్నిహితమవుతారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. సతీమణి నుంచి, పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

కుంభం
స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు చురుకుగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగిన కారణంగా కొద్దిగా శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. మీ వల్ల పొరపాట్లు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో శుభ కార్యానికి అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.

మీనం

వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా సాగిపోతుంది. ఇతరులకు ఉపయోగపడే స్థితిలో ఉంటారు. ఉద్యో గంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. సహోద్యోగులతో సఖ్యత ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z