ఇంద్రకీలాద్రిపై గాజుల అలంకరణలో దర్శనమిస్తున్న కనకదుర్గ అమ్మవారిని సినీ నటి హన్సిక దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హన్సికకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల వేద ఆశీర్వాచనం తీసుకున్నారు. ఆ తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాన్ని ఆలయ అధికారులు హన్సికకు అందజేశారు.అమ్మవారిని దర్శించుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని హన్సిక చెప్పారు. గాజుల అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నాని ఆమె చెప్పారు.మై నేమ్ ఇస్ శృతి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాను విజయవాడ వచ్చానని హన్సిక తెలిపారు. నవంబర్ 17వ తేదీన ఈ చిత్రం వరల్డ్ వైస్ గా రిలీజ్ కానుందని వెల్లడించారు. ప్రేక్షకులందరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –