DailyDose

మిర్యాలగూడలో ఐటీ సోదాలు

మిర్యాలగూడలో ఐటీ సోదాలు

తెలంగాణలో మళ్లీ ఐటీ సోదాలు మొదలయ్యాయి. 40 బృందాలతో హైదరాబాద్‌తో పాటు నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే, భారాస అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు ఇంట్లో వేకువజామున 4 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. భాస్కరరావుకు దేశవ్యాప్తంగా పలు వ్యాపారాలున్నాయి. ఒక్క నల్గొండలోనే 30 బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z