Politics

బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌ చేసే బాధ్యత నాదే

బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌ చేసే బాధ్యత నాదే

త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆదిలాబాద్‌ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. పార్టీ నష్టపోతుందని తెలిసినా సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేసీఆర్‌ పరామర్శించలేదని రేవంత్‌ ఆరోపించారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు. ‘‘కాంగ్రెస్‌ హయాంలో గ్యాస్‌ సిలిండర్ ధర రూ.400 ఉండేది. మోదీ, కేసీఆర్‌ కలిసి ప్రస్తుతం ఆ ధరను రూ.1200 చేశారు. కేసీఆర్‌ వల్ల బోథ్‌కు నీళ్లు రాలేదు. ఈ నియోజకవర్గంలో ఒక్కసారి కాంగ్రెస్‌కు ఓటు వేయండి. కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే బోథ్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసే బాధ్యతతో పాటు ఆదిలాబాద్‌ జిల్లాను నేను దత్తత తీసుకుంటా. డిసెంబర్ 31లోపు బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌ చేసే బాధ్యత నాది. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలున అమలు చేసి తీరుతాం’’అని రేవంత్‌రెడ్డి అన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z