Politics

కేటీఆర్ నూతన ప్రచార రథానికి పూజలు

కేటీఆర్ నూతన ప్రచార రథానికి పూజలు

తెలంగాణలో ఎన్నికల హడావిడి జోరందుకుంది. ఎటు చూసినా పార్టీ కార్యకర్తల నినాదాలు, రకరకాల జెండాలు, ఇంటింటి ప్రచారాలే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ తన ప్రచార శంఖారావాన్ని గత నెలలోనే పూరించారు. రోజుకు మూడు చోట్ల భారీ బహిరంగ సభల్లో పాల్గొంటూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ వంతు వచ్చినట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కేటీఆర్ ప్రచార రధానికి పూజలు నిర్వహించారు. ఈ రథంలో మంత్రి కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహించనున్నారు. స్టార్ క్యాంపెనర్‌గా ఉన్న కేటీఆర్ తనదైన శైలిలో ప్రచారం చేసేందుకు ఈ రథాన్ని రూపొందించారు. మన్న ఆర్మూర్‌లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ప్రచార రథం నుంచి కిందపడబోతూ తృటిలో తప్పించుకున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులు పునరావృత్తం కాకుండా ఉండేందుకు మంచి ప్రణాళికతో ఈ వాహనాన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z