Politics

బీసీల గురించి బీజేపీ మాత్రమే ఆలోచిస్తుంది

బీసీల గురించి బీజేపీ మాత్రమే ఆలోచిస్తుంది

ఓటమి భయంతో సీఎం కేసీఆర్‌ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. పలు చోట్ల నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌ రెడ్డి మాట్లాడారు.

‘‘గజ్వేల్‌లో 114 మంది ధరణి బాధితులు నామినేషన్‌ వేశారు. కామారెడ్డిలోనూ 58 మంది నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. భాజపా తరఫున 39 మంది బీసీలు బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ 22 మంది బీసీలకు మాత్రమే టికెట్లు ఇచ్చింది. భారాస 23 మంది బీసీలకు మాత్రమే టికెట్లు కేటాయించింది. భాజపా మాత్రమే బీసీల గురించి ఆలోచిస్తుంది. గజ్వేల్‌లో ఈటల పోటీ చేస్తారని ప్రకటించగానే కేసీఆర్‌ భయపడ్డారు. అందుకే గజ్వేల్‌ నుంచి కామారెడ్డికి పారిపోయారు. ఈసారి గజ్వేల్‌, కామారెడ్డి రెండు చోట్ల కేసీఆర్‌ ఓడిపోతారు. కేసీఆర్‌, కేటీఆర్‌ ఇద్దరూ ఈ ఎన్నికల్లో ఓడిపోతారు. కేసీఆర్‌ను కామారెడ్డిలో గెలిపించాలని కాంగ్రెస్‌ కుట్ర చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి కేసీఆర్‌ను గెలిపించాలని చూస్తోంది’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z