ఇవాళ్టి నుంచి నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు గన్‌పార్క్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరామ్, రియాజ్, ఆకునురి మురళి.. జెండా ఊపి నిరుద్యోగ చైతన్య యాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్రకు నిరుద్యోగులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇక.. నేటి నుంచి ఈ నెల 25 వరకు 10 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా జరిగే ఈ నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రకు ఎన్నికల కమిషన్ కూడా అనుమతినిచ్చింది.
👉 – Please join our whatsapp channel here –