గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌పై చేబ్రోలు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేశారు. పొన్నూరు రూరల్ సీఐ రాంబాబు గురువారం ఈ వివరాలు తెలిపారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురానికి చెందిన కొందరు రైతులు అక్కడ సంగం డెయిరీ ఆధ్వర్యంలోని పాల కేంద్రానికి పాలు సరఫరా చేశారన్నారు. దాని బకాయిలు అడిగేందుకు బుధవారం వారు చేబ్రోలు మండలం వడ్లమూడిలోని డెయిరీ వద్దకు రాగా ఘర్షణ జరిగిందని, బాధితుల్లో ఒకరైన రాము ఫిర్యాదు మేరకు 15 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. గురువారం రాత్రి 14వ నిందితుడిగా ధూళిపాళ్ల నరేంద్రకుమార్, 15వ నిందితుడిగా జానకిరామయ్య పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చామన్నారు. ఘటన జరిగిన సమయంలో నరేంద్రకుమార్ పొన్నూరులో విలేకర్లతో మాట్లాడుతున్నారని తెదేపా వర్గాలు చెబుతున్నాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z