భారీ భూ పంపిణీ కార్యక్రమానికి నేడు నూజివీడు వేదికగా సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 10,303 మందికి 12,886.37 ఎకరాల భూమిని శాశ్వత హక్కుతో అందించనున్నారు. 31 గ్రామాల్లో ఎస్సీ శ్మశాన వాటికలకు 33.32 ఎకరాలను ఇదే వేదిక నుంచి మంజూరు చేయనున్నారు. శుక్రవారం సీఎం జగన్ నూజివీడు రాక సందర్భంగా హెలీప్యాడ్, బహిరంగ సభ వద్ద భద్రతా ఏర్పాట్లను ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు, కలెక్టర్ వై.ప్రసన్న వెంకటేష్, ఎస్పీ డి.మేరిప్రశాంతి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z