Politics

కాంగ్రెసోళ్లు ప‌చ్చి అబ‌ద్ధాలు చెప్ప‌టంలో పెద్ద మొన‌గాళ్లు

కాంగ్రెసోళ్లు ప‌చ్చి అబ‌ద్ధాలు చెప్ప‌టంలో పెద్ద మొన‌గాళ్లు

ప‌రంపోగు, అసైన్డ్ భూముల‌పై అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెసోళ్లు ప‌చ్చి అబ‌ద్ధాలు చెప్ప‌టంలో పెద్ద మొన‌గాళ్లు.. ఈ అస‌త్య ప్ర‌చారాల‌ను ప్ర‌జ‌లు న‌మ్మాల్సిన అవ‌స‌రం లేదు.. ఇది పూర్తి త‌ప్పుల త‌డ‌క‌, అబ‌ద్ధం అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. న‌ర్సాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

కాంగ్రెసోళ్లు ప‌చ్చి అబ‌ద్ధాలు చెప్ప‌టంలో పెద్ద మొన‌గాళ్లు. ప‌రంపోగు భూములు, ఎవ‌రికైతే అసైన్‌మెంట్ ఇచ్చామో.. ఎస్సీలు కావొచ్చు, ఎస్టీలు కావొచ్చు, బీసీలు కావొచ్చు. వాటిని గుంజుకుంటున్నాం అని చెబుతున్నారు. ఎవ‌ర‌న్న గుంజుకుంటారా..? ఇంత అబ‌ద్ధాలు చెప్పొచ్చునా..? మొన్న‌నే ఎల‌క్ష‌న్ల మేం చెప్పినం. మేనిఫెస్టోలో కూడా చెప్పినం. ఈ అసైన్‌మెంట్ ఇచ్చిన భూముల‌కు వారికి అధికారం లేకుండా పోతుంది. మాముళ్లు వారు అయితే అమ్ముకుంటున్నరు.. కొనుక్కుంటున్న‌రు. వీళ్ల‌కు కూడా కొంత‌కాలం దాటిన త‌ర్వాత ప‌ట్టా ఇవ్వాల‌ని చెప్పినం. ద‌ళిత‌, గిరిజ‌న ఎమ్మెల్యేలు కూడా ప‌ట్టాలు ఇవ్వాల‌ని కోరారు. డెఫినెట్‌గా అసైన్డ్ భూముల‌కు ప‌ట్టా చేసి హ‌క్కులు వారికే ఇస్తామ‌ని మ‌న‌వి చేస్తున్నా. అవి భూములు ఎవ‌రికి పోవు. ఈ అస‌త్య ప్ర‌చారాలు న‌మ్మాల్సిన అవ‌స‌రం లేదు. ఇది పూర్తి త‌ప్పుల త‌డ‌క అబ‌ద్ధం అని మ‌న‌వి చేస్తున్నా అని కేసీఆర్ పేర్కొన్నారు.

ధ‌ర‌ణి ఎత్తేయ‌డం అనేది.. చిన్న‌స‌న్న విష‌యం కాదు..
కాంగ్రెస్ నాయ‌కులు ధ‌ర‌ణి తీసేస్తాం అని చెబుతున్నారు. మేం చెప్పంగ కూడా మాకు ప్ర‌జ‌లు ఓటేసిండ్రు. గ్యారెంటీగా తీసేస్తాం అంట‌రు. అప్పుడు కేసీఆర్ కూడా చేయ‌గ‌లిగేది ఏం ఉండ‌దు. మీరు ఆలోచ‌న చేయండి. ఇది చిన్న‌స‌న్న విష‌యం కాదు. అరిచేది కాదు. డెఫినెట్‌గా ఇది చాలా సీరియ‌స్ మ్యాట‌ర్. ప‌దేండ్ల నుంచి మేం క‌ష్ట‌ప‌డి, మా త‌ల‌కాయ ప‌గుల‌గొట్టుకొని, మూడు సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డి ధ‌ర‌ణి తెచ్చాం. రైతుల భూములు సేఫ్‌గా ఉండాలి.. ఈ జుట్లు ముడేసి పంచాయితీ పోవాలని ధ‌ర‌ణికి రూప‌క‌ల్ప‌న చేశాం. లేక‌పోతే ఇవాళ భూముల ధ‌ర‌లు ఎంత పెరిగిన‌యి తెలంగాణ‌లో. ఇవాళ పెరిగిన ధ‌ర‌ల‌కు ఎన్ని హ‌త్య‌లు, కొట్లాట‌లు అయితుండే. ఎన్ని త‌ల‌కాయలు ప‌గిలిపోతుండే. ఎంత సీరియ‌స్ మ్యాట‌ర్ అయితుండే. ఈ విష‌యం మీరు ఆలోచించాలి. ఇవాళ మీరు ద‌ర‌ఖాస్తు పెట్ట‌కుండా, ఏ ఆఫీసు చుట్టు తిర‌గ‌కుండా నేరుగా మీ ఖాతాలో డ‌బ్బులు ప‌డుతున్నాయి. వ‌డ్లు అమ్మితే కూడా నేరుగా మీ ఖాతాలో డ‌బ్బులు జ‌మ అవుతున్నాయి. ఇంత మంచి స‌దుపాయం వ‌స్తే, వాళ్లు ఉన్న‌నాడు చేయ చేత‌కాలేదు. వారికి తెలివిలేదు. ఇవాళ మేం చేస్తే దాన్ని తీసేస్తాం అంటున్నారు. కాంగ్రెస్ ఆలోచ‌న స‌ర‌ళి ఈ విధంగా ఉంది. ఏది కావాల్నో మీరు నిర్ణ‌యించాలి అని కేసీఆర్ ప్ర‌జ‌ల‌కు సూచించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z