Devotional

హరిహరసుతుని దర్శనానికి పోటెత్తిన భక్తులు

హరిహరసుతుని దర్శనానికి పోటెత్తిన భక్తులు

కేరళలోని శ‌బ‌రిమ‌ల అయ్యప్ప స్వామి ఆల‌యాన్ని నిన్న (గురువారం) సాయంత్రం తెరిచారు. ఇక, మండ‌ల పూజ సీజ‌న్ స్టార్ట్ కావడంతో ఆలయాన్ని తెరిచారు. రెండు నెల‌ల పాటు భక్తులకు అందుబాటులో ఉంచ‌నున్నారు. అయితే, ఈసారి అయ్యప్ప ఆలయం భక్తులకు సరికొత్తగా కనిపించనుంది. ఎందుకంటే, ఆలయ ముఖ ద్వారం దగ్గర కొత్తగా రాతి పిల్లర్లను ఏర్పాటు చేశారు. ఈ శిలలు భక్తులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ శిలలపై అందమైన కళాకృతులు కట్టిపడేస్తున్నాయి. అలాగే, వాటిపై స్వామియే శరణం అయ్యప్ప అని రాశారు. ఆలయ ముఖ ద్వారం దగ్గర హైడ్రాలిక్ రూఫ్‌ని హైద‌రాబాద్‌కి చెందిన ఓ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. చెన్నైకి చెందిన ఓ ఇంజినీరింగ్ క‌న్సల్టెన్సీ సంస్థ దీన్ని డిజైన్ చేసింది. ఆల‌యంలోని 18 బంగారు మెట్లు ఉండే ప‌దినిట్టం పాడిపై ఈ రూఫ్‌ ఏర్పాటు చేశారు. వ‌ర్షం లేని స‌మ‌యంలో ఆ రూఫ్‌ను మడత పెట్టెసుకోవచ్చు.. డిసెంబ‌ర్ 27న మండల దీక్ష సీజన్ ముగియనుంది. అప్పుడు శబరిమల ఆలయాన్ని మూసివేసి.. తిరిగి మ‌క‌ర సంక్రమణ రోజైన డిసెంబ‌ర్ 30న దేవాలయాన్ని తెరుస్తారు. ఆ తర్వాత జ‌న‌వ‌రి 15న అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనం చేసుకోనున్నారు. అయితే, శబరిమల ఆలయానికి వెళ్లే.. భక్తుల కోసం సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రత్యేకంగా ట్రైన్స్ ను నడుపుతున్నారు.

*** ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవే:
శబరిమలకు వెళ్లి, వచ్చే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే.. 4 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు.
1. నవంబర్ 19న సికింద్రాబాద్ – కొల్లం ప్రత్యేక రైలు (07121)
2. నవంబర్ 19న నర్సాపూర్ – కొట్టాయం ప్రత్యేక రైలు (07119)
3. డిసెంబర్ 20న కొట్టాయం – నర్సాపూర్ ప్రత్యేక రైలు (07120)
4. డిసెంబర్ 21న కొల్లం – సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07122)

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z